AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. సోమవారంతో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై రూ. 50 తగ్గింది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. గత రెండు రోజులుగా వెండి ధరలు ఒకే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు మహిళలు ఎక్కువ ఆసక్తిచూపుతారు. దీనికితోడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. తాజాగా తగ్గిన బంగారం ధరలతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది. అయితే, మంగళవారం 10 గ్రాముల బంగారంపై రూ. 50మేర తగ్గింది. దీంతో మంగళవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం ప్రాంతాల్లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,400 వద్ద కొనసాగుతోంది.

ANN TOP 10