సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు గురించి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. ఆయన కాంగ్రెస్ లోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. బేషరతుగా ఎవరు వచ్చినా కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు. మోడీ పాలనలో కేపిటలిస్టులు, కేసీఆర్ పాలనలో దొరలు మాత్రమే బతుకుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో సంపదను సృష్టిస్తే… కేసీఆర్ పాలనలో రూ. 5 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఏం సాధించారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను ఎందుకు మార్చారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. వామపక్షాలు కూడా కాంగ్రెస్ తో కలిసి నడవాలనుకుంటున్నాయని చెప్పారు.
