విశ్వంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకటైన శని.. భూమికి చేరువగా రాబోతోంది. మూడు రోజుల పాటు కనువిందు చేయనుంది. నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రకాశవంతంగా కనిపించనుంది. సాధారణ కంటితోనే ఈ గ్రహాన్ని చూసే వీలుంది. స్పేస్ బైనాక్యులర్స్, టెలిస్కోప్‌లను వినియోగించడం ద్వారా శనిగ్రహాన్ని మరింత స్పష్టం చూడొచ్చు. దీన్ని శాటర్న్ అప్పోజిషన్‌గా పిలుస్తారు. రెండు గ్రహాలు సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పూర్తిగా వ్యతిరేక దిశకు చేరుకోవడాన్ని అప్పోజిషన్ అంటారు. శనిగ్రహం- సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు ఇది ఏర్పడుతుంటుంది. సూర్యుడికి 886 మిలియన్ మైళ్ల దూరంలో ఉంటుంది శనిగ్రహం.
భూమికి అత్యంత సమీపానికి వచ్చినప్పుడు- సూర్యుడితో శని గ్రహం మధ్య దూరం అంటే 746 మిలియన్ మైళ్ల దూరంలో ఉంటుంది. శనిగ్రహం స్పష్టంగా కనిపించడానికి.. దాని పరిమాణం, అందులో ఉండే వాయువులు ఓ కారణం. భూమి రేడియస్ 6,378.1 చదరపు కిలోమీటర్లు కాగా శనిగ్రహ విస్తీర్ణం 36,183.7 చదరపు కిలోమీటర్లు. భూమితో పోల్చుకుంటే తొమ్మిది రెట్లు అధికం. జుపిటర్ తరహాలోనే శనిగ్రహం కూడా ప్రధానంగా హైడ్రోజన్, హీలియంతో నిండి ఉంటుంది. రాత్రి 8:30 గంటల తరువాత దక్షిణ ఆగ్నేయం వైపు శనిగ్రహాన్ని నేరుగా చూడొచ్చు. ఈ నెల 30వ తేదీన పౌర్ణమి చంద్రుడికి అత్యంత సమీపంలోనే కనిపిస్తుంది. తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులకు తీపికబురు గ్రహాలపై పరిశోధన చేయాలనుకునే ఖగోళ శాస్త్రవేత్తలు.. దీన్ని అత్యంత అరుదుగా భావిస్తుంటారు. శనిగ్రహానికి సంబంధించిన వివరాలను సేకరించడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదనేది వారి అభిప్రాయం.