AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు 19 ఎంఎంటీఎస్‌ ట్రైన్లు రద్దు

హైదరాబాద్‌ నగరంలో నిత్యం వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఎంఎంటీఎస్‌ ట్రైన్లను వివిధ కారణాలతో కొద్దిరోజులుగా రద్దు చేస్తున్నారు. తాజాగా.. సోమవారం 19 ట్రైన్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మెుత్తం 19 ట్రైన్లను రద్దు చేసినట్లు సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ట్విట్టర్‌లో వెల్లడించింది. మెుత్తం మూడు రూట్లలో ట్రైన్లు రద్దు చేసినట్లు తెలిపింది. రద్దైన ట్రైన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

లింగంపల్లి – హైదరాబాద్‌ (47135), లింగంపల్లి – హైదరాబాద్‌ (47137), హైదరాబాద్‌ – లింగంపల్లి (47110), హైదరాబాద్‌ – లింగంపల్లి (47111), హైదరాబాద్‌ – లింగంపల్లి (47119), ఫలక్‌ నుమా – లింగంపల్లి (47160), ఫలక్‌ నుమా – లింగంపల్లి (47156), ఫలక్‌ నుమా– లింగంపల్లి (47158), ఫలక్‌ నుమా – లింగంపల్లి (47214), ఫలక్‌ నుమా – లింగంపల్లి (47216), లింగంపల్లి – ఫలక్‌ నుమా (47181), లింగంపల్లి – ఫలక్‌ నుమా (47186), లింగంపల్లి – ఫలక్‌ నుమా (47212), లింగంపల్లి – ఫలక్‌ నుమా (47183), లింగంపల్లి – ఫలక్‌ నుమా (47185), లింగంపల్లి – ఫలక్‌ నుమా (47217), రామచంద్రాపురం – ఫలక్‌ నుమా (47177), ఫలక్‌ నుమా – రామచంద్రాపురం (47218), ఫలక్‌ నుమా – హైదరాబాద్‌ (47201)

ANN TOP 10