AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులోకి ఇషా, ఆకాష్, అనంత్..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాన్యువల్ జనరల్ మీటింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన 46వ సర్వసభ్య సమావేశంలో కంపెనీ కీలక నిర్ణయాలను ప్రకటిస్తోంది. ముఖ్యంగా బోర్డు డైరెక్టర్లలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోకి ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీలను నియమించాలని ఆర్‌ఐఎల్ బోర్డు సిఫార్సు చేసింది. మరోవైపు, నీతా అంబానీ బోర్డు నుండి వైదొలగనున్నారు. ఆమె రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు.

అందరూ అనుకున్నట్లుగానే రిలయన్స్ గ్రూప్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటనలు వెలువడుతున్నాయి. ఏజీఎంలో సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, గత 10 ఏళ్లలో 150 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టిందన్నారు. ఇది భారతదేశంలోని ఏ ఇతర కార్పొరేట్ కంపెనీ కన్నా ఎక్కువే అని తెలిపారు. కన్సాలిడేటెడ్ రెవెన్యూ రూ. 9,74,864 కోట్లుగా ఉన్నాయని ముఖేష్ చెప్పారు. FY23లో ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రస్ట్, ట్యాక్సెస్, డిప్రిసియేషన్, అమార్టైజేషన్ రూ. 1,53,920 కోట్లు, నికర లాభం రూ. 73,670 కోట్లుగా ఉందని ముఖేష్ అంబానీ వెల్లడించారు.

యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. ‘హ్యూమన్ రిసోర్సెస్, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫార్సుల ప్రకారం.. ఇషా ఎం. అంబానీ, ఆకాష్ ఎం. అంబానీ, అనంత్ M. అంబానీలు కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లుగా నియమితులయ్యారు.

మరోవైపు, ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ మాత్రం బోర్డు నుంచి వైదొలిగారు. ఆమె రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతూ, సంస్థ పరిధిని మరింత విస్తరించనున్నాను. ఏజీఎం నేపథ్యంలో, వారసులకు ముఖేష్ అంబానీ కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావించారు. ఈ నేపథ్యంలో, ఆర్‌ఐఎల్‌లో ఇప్పటికే కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు కుమారులు, కుమార్తెకు ఆయన కీలక బాధ్యతలు అప్పజెప్పారు.

ANN TOP 10