స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరునూరైన ప్రజాక్షేత్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు. “ఆరునూరైన ప్రజాక్షేత్రంలోనే ఉంటా. దుక్కిదున్ని, నారుపోసి, కలుపుతీసి, పంటపండించి, కుప్పపోశాక కుప్పపై కూర్చుంటే ఊరుకుంటామా. రేపో, మాపో అనుకున్న కార్యక్రమం చేసి తీరుతా. కాసే చెట్టుకే దెబ్బలు తగులుతాయి.” రాజయ్య అన్నారు. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ టికెట్ కేటాయించడంతో రాజయ్య అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ మారాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో బీసీ కుల వృత్తుల వారికి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ హాట్‌గా మారాయి.
