వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 70 సీట్లు రాబోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో క్లీన్‌స్వీప్ చేస్తామని అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. అత్యధిక అవినీతి సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిందని ఉత్తమ్ ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. పోలీస్ అధికారులను బీఆర్‌ఎస్ నేతలు తమ ఆధీనంలో ఉంచుకోవడం మంచిది కాదని హితువుపలికారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భూకుంభ కోణాలు, ఇసుక, లిక్కర్ మాఫీయాలు చేస్తూ దొంగల ముఠాలా మారారని ఉత్తమ్ ఘాటు విమర్శలు చేశారు.
