AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రయాన్-3 సక్సెస్‌తో ఉప్పొంగిన భారతావని

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. 140 కోట్ల భారతీయుల కలల్ని సాకారం చేస్తూ.. ఇది బుధవారం సాయంత్రం 6:03 గంటలకు జాబిల్లిపై అడుగుపెట్టింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి, ఇంతవరకు ఏ దేశం సాధించని ఘనతని కైవసం చేసుకుంది. భారత వైజ్ఞానిక సంత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. నిజానికి.. దక్షిణ ధ్రువంపై కాలు మోపడమన్నది.. అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు కూడా అందని ద్రాక్ష వంటిది. అలాంటి కఠినమైన చోట చంద్రయాన్-3 కాలుమోపి.. సరికొత్త చరిత్రను సువర్ణక్షరాలతో రాసింది. దీంతో.. యావత్ భారతావని మనసు గర్వంతో ఉప్పొంగుతోంది.

ఆ సంగతులు అలా ఉంచితే.. ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్‌పై ఎంత ఖర్చు వెచ్చించారో తెలుసా? 2020లో అప్పటి ఇస్రో ఛైర్మన్ కే శివన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ చంద్రయాన్-3 బడ్జెట్ 615 కోట్లు. మరి.. ఇంత డబ్బు వెచ్చించడం విలువైనదేనా? ఆ డబ్బంతా వృధా అయినట్టా లేక ప్రయోజనం చేకూరినట్టా? ఇక్కడే మనం కొన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న భాగల్‌పూర్ బ్రిడ్జ్ కూలిన ఘటన గుర్తుందా? ఆ బ్రిడ్జి బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల రూ.1,710 కోట్లు. అంటే.. చంద్రయాన్-3తో పోలిస్తే ఆ బ్రిడ్జి బడ్జెట్ మూడింతలు ఎక్కువ. కానీ.. చివరికి ఏమైంది? బ్రిడ్జి కూలిపోవడంతో ఆ డబ్బంతా వృధా అయ్యింది. కానీ.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం అవ్వడం వల్ల మన భారతదేశం ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పినట్టయ్యింది. దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి.. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రరాజ్యాలకు సవాల్ చేసినట్టయ్యింది. తాము తలచుకుంటే ఏమైనా సాధించగలమని నిరూపించగలిగింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10