AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రీతిది ఆత్మహత్యాయత్నం కాదు.. చంపాలని చూశారు

ప్రీతి తండ్రి సంచలన వ్యాఖ్యలు

కేఎంసీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఈ అంశంపై తాజాగా ప్రీతి తండ్రి నరేందర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతిది ఆత్మహత్యాయత్నం కాదని, హత్య చేయాలని చూశారని సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకునేంత పిరికిది కాదని, తన కూతురిపై హత్యాయత్నం జరిగి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ప్రీతి ఆడియోలను వింటుంటే ఆమెను ఎంతగా వేధించారో అర్థమవుతుందని నరేందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

తమతో ప్రీతి మాట్లాడిన తర్వాత హత్యాయత్నం జరిగి ఉండొచ్చని తండ్రి నరేందర్‌ తెలిపారు. తనతో ఫోన్‌ కాల్‌లో మాట్లాడే సమయంలో కూడా భయంతో ప్రీతి ఉందని, తనను ఏదో చేస్తారనే అనుమానం వ్యక్తం చేసినట్లు చెప్పారు. సైఫ్‌ వేధింపులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, చాలామందిని ఇలాగే వేధిస్తున్నట్లు తనతో చెప్పిందని నరేందర్‌ తాజాగా పేర్కొన్నారు.

ప్రీతి తన తల్లితో మాట్లాడిన ఆడియో కాల్‌ బయటకు లీక్‌ అయిన నేపథ్యంలో.. తండ్రి నరేందర్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హత్యాయత్నం అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుందని కొంతమంది చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు సైఫ్‌ను పోలీసులు రిమాండ్‌లోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దీంతో విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశముంది. వేధింపుల గురించి సైఫ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటపడతాయేది చర్చనీయాంశంగా మారింది.

సైఫ్‌ వేధింపుల గురించి తన తల్లితో ప్రీతి మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది. ఇందులో కాలేజీలో చదువుకోవాలంటేనే తనకు భయమేస్తోందని, సైఫ్‌ వేధింపులు ఆగడం లేదని ప్రీతి తెలిపింది. సైఫ్‌ బ్యాచ్‌ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, తాను భరించలేకపోతున్నట్లు తల్లికి వివరించింది. నాన్న పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సైఫ్‌ ఏమీ చేయలేడని, చదువుపై దృష్టి పెట్టాలని ప్రీతికి తల్లి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది.

ANN TOP 10