AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆసక్తికర ప్రకటన..

మెదక్ జిల్లాలోని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి (Madhan reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేయబోతున్నట్టు తాను అనలేదని క్లారిటీ ఇచ్చారు. కొన్ని మీడియా సంస్థలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయని వివరణ ఇచ్చారు. ‘‘ నేను కేసీఆర్‌కు విధేయుడిని. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నాకు కేసీఆర్ అన్యాయం చేయడు’’ అని అన్నారు. ఈ మేరకు నర్సాపూర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ మారబోవడం లేదంటూ ప్రకటన చేశారు.

ANN TOP 10