AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ బామ్మకు వింత అలవాటు..13 ఏళ్లుగా అన్నం ముట్టదు.. సుద్ద ముక్కలే..

ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 13 యేళ్లుగా అన్నం ముట్టలేదు. అన్నం చూస్తేనే.. వాంతులు అవుతున్నాయంటుంది.. అంతేకాదు ఇతర.. ఆహారం కూడా.. ముట్టుకోదు. కేవలం.. సుద్ద ముక్కలు అటుకులు మాత్రమే తింటూ, కడుపు నింపుకుంటుంది. అన్నం తినకున్నా.. ఎలాంటి అనారోగ్యానికి గురి కావడం లేదు. చాలా యాక్టివ్ గా ఉంటుంది.. కుటుంబ సభ్యులు చాలా సార్లు అన్నం తినిపించేందుకు ప్రయత్నం చేశారు. కానీ, ఈమె మాత్రం తినలేదు.. అన్నం చూడగానే, భయంతో పరుగులు తీస్తుంది. దీంతో.. ఆమెకు ఇష్టమైన సుద్ద ముక్కలను ఆహారంగా అందిస్తున్నారు.

రాజన్న సిరిపిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనికల్ గ్రామానికి చెందిన మల్లవ్వకు. 13 యేళ్ల క్రితం.. అన్నం తింటున్నప్పుడు.. ఎవరో చూశారు. కొద్ది సేపు తరువాత.. వాంతులు అయ్యాయి. ఇక.. అప్పటి నుంచీ.. అన్నాన్ని చూడగానే వాంతులు అవుతున్నాయి. కుటుంబ సభ్యులు ఈమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. అన్నం ముట్టడం లేదు. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లినా.. మనస్సు మార్చుకోలేదు.

అయితే మల్లవ్వకు సరిగా మాటలు రావు, ఇంటి వద్దనే ఉంటుంది.. గతంలో… ఈమెను వివిధ అసుపత్రులకు తీసుకెళ్లారు. అయినప్పటికీ.. అన్నం మాత్రం తినడం లేదు. అన్నం తింటే.. వాంతులు అవుతాయనే అనుమానంతో.. ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ఇక.. కుటుంబ సభ్యులు కూడా.. చెప్పడం మానేశారు.. ఆమె కోసం.. సుద్ద ముక్కలు మాత్రం తీసుకొస్తారు. వాటిని, చిన్న, చిన్నగా కట్ చేసి. సుద్ద ముక్కలు తింటుంది. సుద్ద ముక్కలు తిన్నా. అనారోగ్యానికి గురి కావడం లేదు.. మొత్తానికి అన్నం లేకుండానే.. 13 యేళ్లుగా ఉండటంతో.. చాలా వింతగా ఉందని స్థానికులు అంటున్నారు.

ANN TOP 10