AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎల్బీనగర్ మహిళ థర్డ్ డిగ్రీ కేసులో తక్షణ చర్యలు

ఎల్బీనగర్ మహిళ థర్డ్ డిగ్రీ కేసులో తక్షణ చర్యలు చేపట్టారు. ఇప్పటికే మహిళ కేసులో ఉన్న పోలీసులపై ఎస్సీ, ఎస్టీ కేసులను ఎల్బీనగర్‌ పోలీసులు నమోదు చేశారు. ఒక ఎస్ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసులు నమోదు చేశారు. బాధితురాలి కూతురు పూజ ఫిర్యాదుతో పోలీసుల చర్యలు చేపట్టారు.ఈనెల 15వ తేదీన తన అంకుల్ చందుకి రూ.3 లక్షలు నగదు తీసుకెళ్తుండగా.. పోలీసులు లాక్కొని దాడి చేశారంటూ పూజ ఫిర్యాదు చేసింది.తన తల్లి మోకాళ్లు, చేతుల, తొడలపై విచక్షణారహితంగా.. పోలీసులు కొట్టారంటూ పూజా ఈ ఫిర్యాదులో పేర్కొంది. కులం పేరుతో దూషిస్తూ తల్లిపై దాడి చేశారంటూ ఆమె ఫిర్యాదు ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇప్పటికే హెడ్‌కానిస్టేబుల్‌ సహా మహిళా కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎస్ఐను పోలీస్ కంట్రోల్ రూమ్కు రాచకొండ సీపీ బదిలీ చేశారు. మరోవైపు ఈఘటనపై ప్రతిపక్షనేతలు కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10