AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు..

పరుగులు పెట్టిన ప్రయాణికులు

మహబూబాబాద్‌: నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్‌ నుంచి చైన్నై వెళ్తున్న నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో నుంచి ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన లోకో ఫైలట్‌ మహబూబాబాద్‌ స్టేషన్లలోనే రైల్వే రైలును నిలిపివేశారు. బ్రేక్‌ లైనర్స్‌ పట్టివేయడంతో పొగలు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైలు నుంచి దిగి పరుగులు పెట్టారు. రైలును నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు.

ANN TOP 10