AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘తెలంగాణలో ఇంత ఘోరమా..?’.. డింపుల్ పోస్ట్ వైరల్

టాలీవుడ్ ముద్దుగుమ్మ డింపుల్ హయాతి మరోసారి వార్తల్లో నిలిచింది. ఖిలాడి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. సినిమాలతో కాకుండా మిగతా విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య రామబాణం సినిమాలో నటించినా.. అది పెద్దగా సక్సెస్ కాలేదు కానీ.. ట్రాఫిక్ డీసీపీ రాహుల్‌ హెగ్డేతో జరిగిన వివాదం మాత్రం ఫుల్ ఫేమస్ అయ్యారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు కూడా నమోదైందండోయ్. అయితే.. ఆ వివాదం తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ విషయంలో అటు పోలీసులపై, ఇటు సర్కారుపై కొన్ని సెటైరికలు పోస్టులు కూడా పెట్టింది.

కాగా.. ఇప్పుడు మరోసారి డింపుల్ హయాతి ఇన్‌స్టాగ్రాంలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. కుక్కలను దారుణంగా కట్టేసి తరలిస్తున్న వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది ఈ బ్యూటీ. అయితే.. కేవలం షేర్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ దానికి “తెలంగాణలో ఇంత ఘోరంగా జరుగుతుందా.. ఎవరైనా ఆపండి” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో డింపుల్ పోస్ట్.. కాస్త వైరల్ అవుతోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10