ఖైరతాబాద్ గణేశ్ నమూనాను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ఏడాది శ్రీ దశమహా విద్యా గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేశుడు కొలువుదీరనున్నారు. 63 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్‌కు కుడి వైపున శ్రీ పంచముఖ లక్ష్మీనారసింహా స్వామి ఉంటారు. ఖైరతాబాద్ గణేశ్‌కు ఎడమ వైపున శ్రీ వీరభద్ర స్వామి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
