AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

16 ముక్కలుగా నరికి… పెట్రోల్ పోసి తగలబెట్టారు

అమరావతి: పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని చంపిన అనంతరం 16 ముక్కలుగా నరికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దాచేపల్లి గ్రామానికి చెందిన బొంబోతుల సైదులు, జి కోటేశ్వర్ రావు(45) అనే వ్యక్తులు నగర పంచాయతీ ఆఫీస్‌లో పని చేస్తున్నారు. విద్యుత్ మోటారును ఆపడానికి వాటర్ ట్యాంకు వద్దకు కోటేశ్వర్ రావు వెళ్లారు. అదే సమయంలో సైదులు తన కుమారుడుతో కలిసి కోటేశ్వర్ రావుపై దాడి చేశారు. తలపై రాడ్లతో కోట్టడంతో అతడు ఘటనా స్థలంలో చనిపోయాడు. మృతదేహాన్ని సంచిలో వేసుకొని తన పొలం వద్దకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని 16 ముక్కలుగా నరికి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టారు.

రాత్రి సమయంలో కోటేశ్వర్ రావు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెతకడం ప్రారంభించారు. ఎదురుగా వస్తున్న సైదులను కోటేశ్వర్ రావు కనిపించాడా? అని కుటుంబ సభ్యులు అడిగారు. తనకు తెలియదని చెప్పడంతో పాటు అక్కడ నుంచి త్వరగా జారుకున్నాడు. అనుమానంతో ఆ ప్రాంతమంతా కలియ తిరుగుతుండగా సైదులు పొలంలో మంటలు కనిపించడంతో అక్కడికి వెళ్లారు. ఒక కాలు మంటలకు బయట ఉండడంతో వెంటనే సైదులు ఇంటికి వెళ్లారు. అతడి భార్య భర్త కు సంబంధించిన రక్తపు మరకలతో ఉన్న దుస్తువులను ఉతుకుతుండగా గ్రామస్థులు అనుమానంతో సైదులును పట్టుకున్నారు. వెంటనే పోలీసులు సైదులు కుటుంబాన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10