AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పొంగులేటికి షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన తెల్లం వెంకట్రావు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి షాక్ తగిలింది. నిన్నటి వరకూ ఆయనకు అండగా ఉన్న తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఆయనకు మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లేనని వెంకట్ రావు కు త్వరగానే అర్థం అయిందన్నారు. అందుకే తిరిగి ఈ రోజు పార్టీలోకి వచ్చారన్నారు. వెంకట్రావు భవిష్యత్‌‌కు తమది బాధ్యత అని కేటీఆర్ అన్నారు.

ఖమ్మం పక్కనే ఉన్న చత్తీస్‌గడ్ పోడు భూములకు పట్టాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఇక్కడ కాంగ్రెస్ నేతలు పెద్ద పెద్ద డైలాగ్స్ కొడుతున్నారన్నారు. ఎకరానికి పది క్వింటాళ్లు మాత్రమే చత్తీస్‌గడ్‌లో కొంటున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ను ఎందుకు ఆదరించాలని ప్రశ్నించారు. రూ.4 వేలు పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు నాలుగు వేలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేపు 25గంటల కరెంట్ ఇస్తామని అన్నా అంటారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నారన్నారు.

ఇంకా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వారు మనకు అవసరమా? ఎవరికి ఏం అన్యాయం చేశారని కేసీఆర్‌కు ఓటు వేయరు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు రాని ఇల్లు లేదు. కాంగ్రెస్ వాళ్లకు కూడా రైతు బంధు వస్తుంది.. తీసుకుంటున్నరు తిడుతున్నారు. భద్రాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం. భద్రాచలానికి శాశ్వత వరద నివారణకు కరకట్టల నిర్మాణం చేస్తాం. ఎవరెన్ని వాగినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10