తెలంగాణలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకుంటున్న అభ్యర్థులకు అలర్ట్. ఈ రోజు నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ ను నిర్వహించనున్నట్లు ఎంసెట్ అధికారులు ప్రకటించారు. అభ్యర్థులు ఆ రోజు స్లాట్ బుక్ చేసుకుని ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం 18న ధ్రువపత్రాలను పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు 17, 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకున్న వారికి 23న సీట్లను కేటాయించనున్నారు. ఇప్పటికే మూడో దశ కౌన్సెలింగ్ తర్వాత 19,049 సీట్లు మిగిలాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ తర్వాత కూడా మిగిలిన సీట్ల భర్తీకి సంబంధిత కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లను నిర్వహించనున్నారు.









