గుండెపోటుతో 14 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ కాలనీకి చెందిన మాదాసి రాజేశ్ (14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. రోజులాగే బుధవారం ఉదయం రాజేశ్ బడికి వెళ్లాడు. కొద్దిసేపటికే ఛాతి లో నొప్పి రావడంతో కుప్పకూలాడు. గుర్తించిన ఉపాధ్యాయులు వెంటనే రాజేశ్‌ను ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఇతడికి గతంలో ఒకసారి గుండెపోటు వచ్చినట్టు తల్లిదండ్రులు తెలిపారు. కుమారుడి మృతితో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
