AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాకతీయ యూనివర్సిటీలో కొనసాగుతున్న బంద్

తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు అధ్యాపకులు యూనివర్సిటీల బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో (Kakatiya university) బంద్ కొనసాగుతోంది. కేయూ అకాడమిక్ బ్లాక్ ముందు కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు కేయూ విద్యార్థులు సంఘీభావం తెలిపారు. వంద రోజుల నుంచి నిరసనలు తెలిపినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమ సమస్యలపై ఎమ్మెల్యేలు మాట్లాడిన ఫలితం లేదంటూ ఆగ్రహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనివర్సిటీలలో బంద్ కొనసాగుతోంది.

ANN TOP 10