AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం గారడీ మాటలను ప్రజలు నమ్మరు .. భట్టి

– ‘పీపుల్స్‌మార్చ్‌’ ఫలితంగానే బీసీ బంధు, రుణమాఫీ
రాష్ట్రవ్యాప్తంగా తాను చేసిన పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్ర ఫలితంగానే ప్రభుత్వం బీసీబంధు, రుణమాఫీ, గృహ లక్ష్మి, పోడు భూములకు పట్టాలు లాంటి పథకాలు అమలు చేస్తోందని, కానీ వీటిని తూ..తూ మంత్రంగా కాకుండా అర్హులైన అందరికీ అందించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టే సీఎంకు ప్రజాసమస్యలు గుర్తుకొచ్చాయని అన్నారు. నాటి నిజాం రాష్ట్రంలో 15లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని, స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నాగార్జునసాగర్‌, శ్రీరాంసాగర్‌ లాంటి ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి మరో35లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడేనాటికి మరో40లక్షల ఎకరాలకు నీరందించేందుకు జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులకు డిజైన్‌ చేసి పనులు ప్రారంభించా మన్నారు.

కానీ మధిర ఏటి మీద కట్టినట్టు గోదా వరి మీద కాళేశ్వరం పేరుతో మూడు చెక్‌డ్యాంలు కట్టి కోటి ఎకరాలకు నీరిస్తున్నట్టు ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. అలాగే తమ హయాంలో అమ్మహస్తం పేరుతో తొమ్మిది నిత్యావసర వస్తువులు, బంగారు తల్లి, రైతులకు వడ్డీ లేని రుణాలు, సబ్సీడీ పైన విత్తనాలు, ఎరువులు, స్ర్పింకర్లు, డ్రిప్పు పైపులు ఇస్తే నేడు వాటిలో కొన్నింటిని పూర్తిగా ఎత్తేశారని, కొన్నిటికి పేర్లుమార్చి తమవిగా గొప్పలు చెప్పుకొంటున్నారని విమర్శించారు.

ANN TOP 10