AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ రూట్‌లో తీరనున్న ట్రాపిక్ సమస్య..

నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహానికి చెక్ పెట్టేలా ఫ్లై ఓవర్ల నిర్మాణంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద 30 వేల కోట్ల రూపాయలతో పలు పై వంతెనలు, అండర్ పాస్ లు నిర్మించింది. ఇప్పటివరకు 32 ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా.. 33వ ప్రాజెక్టుగా ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి నగరవాసులకు అందుబాటులోకి వస్తోంది.

లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్ల దూరంలో 5 జంక్షన్లతో ఎవరైన ఆర్టీసీ క్రాస్ రోడ్డు దాటి విద్యానగర్ వైపు వెళ్లాలంటే అరగంట టైం పడుతుంది. ఆ దూరాన్ని మరింత చేరువచేసేలా జంక్షన్లు జామ్ కాకుండా వాటిపై నుంచి దక్షిణ భారతంలోనే అతిపొడవైన 2.6 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మించింది. నిత్యం రద్దీ ఉండే ఇందిరాపార్కు, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్ నగర్, మూవీ థియోటర్ల జంక్షన్ ఆర్టీసీ క్రాస్ రోడ్, బస్ భవన్, వీఎస్టీ వరకు ఈ స్టీల్ వంతెనతో ట్రాఫిక్ సమస్య తీరనుంది.

నగరంలో ట్రాఫిక్ నిత్య నరకం. గూగుల్ మ్యాప్‌లో ఏ రూట్ చెక్ చేసినా రెడ్ మార్క్ కనిపించేంత రద్దీ రోడ్లు హైదరాబాద్‌ వి. అలాంటి ట్రాఫిక్ పద్మవ్యూహానికి చెక్ పెట్టేలా ఫ్లై ఓవర్ల నిర్మాణంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద 30 వేల కోట్ల రూపాయలతో పలు పై వంతెనలు, అండర్ పాస్ లు నిర్మించింది. ఇప్పటివరకు 32 ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా.. 33వ ప్రాజెక్టుగా ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి నగరవాసులకు అందుబాటులోకి వస్తోంది.

ANN TOP 10