AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరో రెండు జేఎన్టీయూ కళాశాలలు… సర్కారు ఉత్తర్వులు జారీ

ఖమ్మం, మహబూబాబాద్ విద్యార్థులకు కేసీఆర్ సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది. ఖమ్మం జిల్లాలోని పాలేరు, మహబూబాబాద్‌లో జేఎన్‌టీయూ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇంజినీరింగ్‌లో మొత్తం ఐదు కోర్సులతో ఆయా ప్రాంతాల్లో జేఎన్టీయూ కళాశాలలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఒక్కో కోర్సులో 60 సీట్లతో కాలేజీల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా.. సీఎస్‌ఈ, డేటా సైన్స్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ కోర్సులతో కొత్త జేఎన్టీయూ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి.

అయితే… కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ కాలేజీలు ఈ విద్యా సంవత్సరం నుంచే పాలేరు, మహబూబాబాద్ జేఎన్టీయూ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నెల 17 నుంచి 19 వరకు జరగనున్న ప్రత్యేక విడత వెబ్ ఆప్షన్ల నాటికి ఈ సీట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ రెండు కొత్త వాటితో కలిపి తెలంగాణలో జేఎన్టీయూ బీటెక్‌ కాలేజీల సంఖ్య ఎనిమిదికి చేరుకున్నాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, సిరిసిల్ల, జగిత్యాల, మంథని, సుల్తాన్‌పూర్, వనపర్తిలో ఇప్పటికే జేఎన్టీయూ కళాశాలు ఉన్న సంగతి తెలిసిందే.

ANN TOP 10