AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూనియర్‌ ఎన్టీఆర్‌కు టీడీపీని అప్పగించండి..

కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌కు విశ్వసనీయత లేదని.. పార్టీని జూ.ఎన్టీఆర్‌కు అప్పగించాలని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై గుడివాడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు పది కాలాల పాటు వినిపించాలంటే పార్టీ బాధ్యతలు జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్‌ చేశారు. అయినా, దివంగత ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీలోకి జూనియర్‌ ఎన్టీఆర్‌ను లోకేష్‌ ఆహ్వానించడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్‌కు నిశ్వసనీయత లేదని.. పార్టీని కాపాడటం తమ వల్ల కాదని వారికి అర్థమైపోయిందన్నారు.

పార్టీ బాధ్యతలను జూనియర్‌ ఎన్టీఆర్‌కు అప్పజెబితే టీడీపీ కనీసం ప్రతిపక్షంలోనైనా ఉంటుందన్నారు. వాస్తవానికి లోకేష్‌కు ఏ మాత్రం విశ్వసనీయత లేదని.. తనను వాడుకుని ఆ తర్వాత ఎలా అవమానించారో జూనియర్‌ ఎన్టీఆర్‌కు తెలీదా అని ప్రశ్నించారు.

2009 తర్వాత జరిగిన మాహానాడులో లోకేష్‌ కోసం జూ.ఎన్టీఆర్‌ను అవమానించారని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో గెలిచాక ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ను గ్యాలరీలో కూర్చొబెట్టి అవమానించారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎలాంటి వారో తన తాత, తండ్రి, మేనత్తలు చెప్పింది ఎన్టీఆర్‌ వినే ఉంటారన్నారు. చంద్రబాబు చేసే అవమానం ఎలా ఉంటుందో స్వయంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫేస్‌ చేశారని వ్యాఖ్యానించారు.

ANN TOP 10