నేటి సమాజంలో ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఆడిపిల్లలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నగరంలో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లమ్మ బండలో చిన్నారి పట్ల ఓ కీచకుడు దారుణానికి పాల్పడ్డాడు.
13ఏళ్ల మైనర్‌పై కన్నేసిన సంజీవ్ కుమార్ (35) అనే వ్యక్తి అదును చూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక నోట్లో బట్టలు కుక్కి రెండు రోజులుగా అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా మెడపై కత్తి పెట్టి ఎవరికైనా చెపితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నాడు. బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.