AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుమల నడక మార్గంలో ఎలుగుబంటి హల్ చల్

తిరుమల మెట్టు నడక మార్గంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఎలుగుబంటి భక్తులకు కనిపింది. ఇవాళ ఉదయం 2000వ మెట్టు దగ్గర భక్తుల కంటపడింది ఎలుగుబంటి. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. దీంతో అలర్ట్‌ అయిన అధికారులు..ఎలుగు బంటి కోసం గాలిస్తున్నారు.

భక్తులు ఈ విషయంలో భయపడకూడదని..పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలని అధికారులు చెబుతున్నారు. కాగా, తిరుమల నడక మార్గంలో చిన్నారి లక్షితను చంపిన చిరుతను అధికారులు బందించగా… తిరుమల నడక మార్గంలో మరో మూడు చిరుతలు సంచరిస్తున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అవి తిరుగుతున్న ప్రాంతాలను గుర్తించినట్లు వెల్లడించారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాటిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే టీటీడీ ఉన్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయన్నారు.

ANN TOP 10