AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ కీలక హామీలు.. 18న డిక్లరేషన్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి.. ఈ నెల 18న ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేతుల మీదుగా విడుదల చేస్తున్నామని తెలిపారు. అయితే.. ఆదివారం రోజున మాజీ మంత్రి చంద్రశేఖర్‌ను కలసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్.. బీఆర్ఎస్, బీజేపీలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కమలం, కారు పార్టీలది ఫెవికాల్ బంధం అని చెప్పుకొచ్చారు రేవంత్. కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నా.. కేంద్ర ప్రభుత్వం సైలెంట్‌గా ఉందని దుయ్యబట్టారు. పరస్పర సహకారంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని ఆరోపించారు.

ప్రభుత్వమే కబ్జాకోరుగా మారి దళితుల భూములను అమ్ముకుంటోందని రేవంత్ కీలక ఆరోపణలు చేశారు. దళితులకు, గిరిజనులకు ఇచ్చే అసైన్డ్ భూములకు కాంగ్రెస్ సర్కారులో స్పష్టమైన హక్కులు ఉంటాయని తెలిపారు. పార్లమెంట్‌లో నోరు తెరవకపోయినా.. 2009లో కేసీఆర్‌ను పాలమూరు జిల్లా భుజాలపై మోసిందని.., కానీ పాలమూరులో ఏ ప్రాజెక్టు కట్టినా కొల్లాపూర్ ప్రజల భూములే గుంజుకున్నారని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భూ నిర్వాసితులందరినీ ఆదుకుంటామన్నారు. పాలమూరు ప్రజలు జెండాలను, ఎజెండాలను పక్కనబెట్టి కాంగ్రెస్‌ను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని రేవంత్ సూచించారు.

ANN TOP 10