సూపర్ స్టార్ రజినీకి ‘జైలర్’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో రజినీకాంత్ ఉత్తరాఖండ్‌లో ఛార్‌ధామ్‌లో ఒకటైన ‘బద్రీనాథ్’ ఆలయాన్ని సందర్శించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘జైలర్’ సినిమాలో తలైవా టైటిల్ రోల్ పోషించారు. ఈ సినిమా సక్సెస్‌ను ముందుగానే ఊహించిందని చెప్పుకొచ్చారు. ఈ రోజు తెల్లవారుఝామున శివుడికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ఒక రోజు ముందు రజినీకాంత్.. ఋషికేష్‌లోని దయానంద గురూజీ ఆశ్రమాన్ని సందర్శంచారు. ఈ సందర్భంగా గురూజీ ఈ సినిమా హిట్ అవుతుందని ముందుగానే చెప్పారు.
ఆయన చెప్పినట్టే సినిమా హిట్ అవుతుందని చెప్పారు. ఆయన చెప్పారంటే .. ‘జైలర్’ మూవీ హిట్ అయినట్టే చెప్పారు. ఈ మూవీలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ ఇతర ముఖ్యపాత్రలో నటించారు. ఎప్పటిలాగే రజినీకాంత్ తన స్టైల్, లుక్స్ అండ్ డైలాగ్స్‌తో వావ్ అనిపించారు. దీనికి తోడు అలరించే థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాయి. ఇక ఈ సినిమా కలెక్షన్స్ (Jailer Collections) విషయానికి వస్తే.. పాజిటివ్ టాక్‌తో ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకుని వావ్ అనిపించింది.
తాజాగా రజినీకాంత్ నటించిన ‘జైలర్’ మూవీని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ వీక్షించారు. అంతేకాదు ఈ సినిమాలో నటించిన రజినీకాంత్‌తో పాటు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసారు.