టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. గతకొంత కాలంగా ఆమె మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించింది. ఈ క్రమంలో కొత్త సినిమాలను అంగీకరించడం లేదు. చేతిలో ఉన్న ప్రాజెక్టులను అన్నింటినీ పూర్తి చేసింది. సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఇటీవలే ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే.
సినిమాల నుంచి విరామం తీసుకున్న సమంత కొద్ది రోజులుగా తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. పుణ్యక్షేత్రాలను సందర్శించడంతో పాటు విదేశాలకు వెళ్లి ఆనందంగా గడుపుతోంది. త్వరలోనే ఆమె చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. ఏదీఏమైనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోస్ షేర్ చేస్తుండడంతో పాటు కొన్ని సార్లు ఫిలాసఫీ కోట్స్ పెడుతుంటుంది.
తాజాగా సామ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. బొద్దింకను చంపితే హీరో అవుతారు. సీతాకోక చిలుకను చంపితే విలన్ అవుతారు. నైతికకు కూడా సౌందర్య ప్రమాణాలు ఉన్నాయి. అంటూ సమంత రాసుకొచ్చింది. ఇది నెట్టింట వైరల్‌గా మారగా ఆమె ఎవరికి గురించి ఇలా చెప్పింది అంటూ ఆరా తీసే పనిలో పడ్డారు నెటీజన్లు.