AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ రిలీఫ్..

కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ రిలీఫ్. గ్రూప్ 2 పరీక్షను రీషెడ్యూల్ చేసింది టీఎస్ పీఎస్సీ. గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు కొత్త తేదీలు అనౌన్స్ చేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. ఉదయం 10 నుంచి 12.30 గంటలవరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామంది. గ్రూప్ 2 పరీక్షకు వారం రోజుల ముందు నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29, 30న గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే, అభ్యర్థుల డిమాండ్ తో పరీక్షను వాయిదా వేసింది టీఎస్ పీఎస్ సీ.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షలను ప్రభుత్వం నవంబర్ కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీషెడ్యూల్‌ చేసిన తేదీలను టీఎస్‌పీఎస్సీ ఆదివారం(ఆగస్టు 13) సాయంత్రం విడుదల చేసింది. నవంబర్‌ 2, 3 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్షలు నిర్వహించనున్నట్టు TSPSC వెల్లడించింది. తెలంగాణలో మొత్తం 783 గ్రూప్‌ 2 ఉద్యోగాలకు 5లక్షల 51వేల 943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడనున్నారు.

తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, ఆగస్టు నెలలో పలు పరీక్షలు ఉన్నాయి. గురుకుల టీచర్‌ పరీక్షలు, స్టాఫ్‌నర్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్స్‌, పాలిటెక్నిక్‌, జూనియర్‌ లెక్చరర్‌, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్‌ వంటి పలు పోటీ పరీక్షలు ఉన్నాయి.

ANN TOP 10