కల్లు తాగమన్న గౌడన్న.. కాదనలేక దమ్ముపట్టిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో బోనాల పండుగ సంబురాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. పాలకుర్తిలో ఊరి దేవత అయిన పోషమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు.. పాలకుర్తి వెళ్తున్న మార్గ మధ్యంలో బురాన్పల్లి వద్ద ఓ గీత కార్మికుడు కల్లు తీస్తుండగా గమనించారు. వెంటనే వాహనాన్ని ఆపి అక్కడి వెళ్లారు. దీంతో.. గీత కార్మికుడు కల్లు తాగమని మంత్రిని అడగ్గా మంత్రి ఎర్రబెల్లి రుచి చూశారు. ఈ సందర్భంగా పిల్లలు ఏమి చేస్తున్నారు?… సీఎం కేసిఆర్ అందిస్తున్న పథకాలు అమలు అవుతున్నాయా…? అంటూ కార్మికుడితో కొద్దిసేపు సరదాగా ముచ్చటించారు.
