AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

19, 20 తేదీల్లో సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన

మెదక్, సూర్యాపేట జిల్లాల్లో నిర్మించిన నూతన కలెక్టరేట్లను, జిల్లా పోలీస్ కార్యాలయాల ను ఈ నెల 19, 20వ తేదీల్లో సీఎం కేసీఆర్‌
ప్రారంభించనున్నారు. ఈ నెల 19న (శనివారం) మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ (ఎస్‌పి) కార్యాలయాన్ని సిఎం ప్రారంభిస్తారు. అదేరోజు మెదక్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

20న (ఆదివారం) కేసీఆర్‌ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా నిర్మాణం పూర్తిచేసుకున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీస్ (ఎస్‌పి) కార్యాలయం, నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

ANN TOP 10