AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈనెల‌ 27న‌ తెలంగాణకు అమిత్ షా?

అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో.. బీజేపీ అధిష్ఠానం తెలంగాణపై దృష్టి సారించింది. ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి రావాలని సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కేంద్రమంత్రులు రాష్ట్రంలో పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక తాజాగా అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల‌ 27న‌ తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. అదే రోజున ఖమ్మంలో భారీ సభ నిర్వహించేందుకు బీజేపీ అధిష్ఠానం ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికే అమిత్ షా పర్యటన రాష్ట్రంలో రెండు సార్లు వాయిదా పడడంతో ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో పర్యటించాలని అమిత్‌షాకు రాష్ట్ర బీజేపీ నేతలు విన్నవించారు. మరోవైపు త్వరలో తెలంగాణ బీజేపీ విజయ సంకల్ప యాత్రలు? చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఒక్కో యాత్రకు తెలంగాణ అగ్ర నాయకులు ప్రముఖ పాత్ర వహించనున్నారు. విజయ సంకల్ప యాత్రల్లో కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన, సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

ANN TOP 10