దృక్పథం, పక్కా ప్రణాళికతోనే రాణింపు
ఇష్టంగా చదవాలి.. ఉన్నత స్థాయికి చేరుకోవాలి
విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన కంది శ్రీనన్న
ఆదిలాబాద్: మనం అనుకున్నది సాధించాలంటే సరైన ఆలోచనా దృక్పథం, ప్రణాళిక ఉండాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీచైతన్య స్కూల్ లో జరిగిన మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్దులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులను చూసి తన బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఒక రైతుబిడ్డగా కష్టపడి ఆదిలాబాద్ నుంచి అమెరికా వరకు తను ఎదిగిన తీరును వివరించి వారిలో స్ఫూర్తిని నింపారు. అలాగే రాజకీయాల్లో రాణిస్తున్న మహిళల గురించి తెలియజేసి విద్యార్థుల్లో రాజకీయాల పట్ల ప్రేరణ కలిగించారు.
సమాజానికి తనవంతుగా ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు కంది శ్రీనివాస రెడ్డి తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ప్రయోజకులై ఎక్కడికెళ్లినా పుట్టిన గడ్డను మాత్రం మరువ కూడదన్నారు. పరీక్షల్లో బాగా రాణించిన విద్యార్ధులకు గ్రేడ్ సర్టిఫికెట్ లు అందజేసారు. అనంతరం మాక్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటు వేసి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గౌడ్, వైస్ ప్రిన్సిపాల్ అమరేందర్ రెడ్డి, గిమ్మ సంతోష్, నాగర్కర్ శంకర్, షకీల్, రామ్ రెడ్డి, కొండూరి రవి, షేక్ మన్సూర్, పోతారాజు సంతోష్, ప్రవీణ్, మానే శంకర్, దర్శనాల చంటి, అస్బాత్ ఖాన్, ముఖీమ్, కర్మ, షేక్ షాహిద్, సైఫ్ ఉద్దీన్, పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.