AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు.. బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఎఫెక్ట్

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఒక వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. గుజరాత్, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. బెంగాల్, ఒడిశా, తెలంగాణ, కొంకణ్, గోవా, కోస్టల్ కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..

శనివారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడి ఉంది. ఈ తుఫాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉంది. దీనికి అదనంగా, సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

ANN TOP 10