AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముస్తాబవుతున్న గోల్కొండ.. ఈసారీ పంద్రాగస్టు వేడుకలు అక్కడే!

ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా గోల్కొండ కోటపై ఆగస్టు 15 వేడుకలు జరగనున్నాయి. అక్కడే సీఎం జెండా ఎగరేస్తారు. అందువల్ల అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులుగా గోల్కొండ కోటను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఫుల్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. దాదాపు 400 మంది పోలీసులు ఇందులో పాల్గొన్నారు. అడుగడుగునా పోలీసుల భద్రత ఉంది. అడిషనల్ డీసీపీ స్వాతిలక్రా కూడా రిహార్సల్స్ ఎలా జరుగుతున్నాయో గమనించారు.

ప్రస్తుతం గోల్కొండ కోట రోజూలా లేదు. పూర్తిగా సెక్యూరిటీ వలయాలతో నిండిపోయింది. కోటకు చుట్టూ 5 కిలోమీటర్ల పొడవునా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, CRPF, సిటీ సెక్యూరిటీ వింగ్, స్టేట్ పోలీస్ వంటి బృందాలు రెండు వారాలుగా ఇదే అంశంపై కసరత్తు చేస్తున్నాయి.

ప్రస్తుతానికి ఉన్న షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 15న ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ జెండాని ఎగరేస్తారు. అంతకంటే ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కి వెళ్లి అక్కడున్న అమరవీరుల స్మారకస్థూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పగడ్బందీగా జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ANN TOP 10