AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ పై గద్దర్ కొడుకు షాకింగ్ కామెంట్స్‌

ఇటీవలి జరిగిన పరిణామాలపై ప్రముఖ విప్లవ జానపద గాయకుడు గద్దర్ కుమారుడు సూర్యకిరణ్.. కేసీఆర్ పైనా, ఆయన ప్రభుత్వంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును… ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తన తండ్రిని కేసీఆర్ సర్కార్ ఇబ్బందులు పెట్టిందని ఆయన అన్నారు. అవును… ఇటీవల మృతి చెందిన గద్దర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వం తన తండ్రి గద్దర్‌ ను చిత్రహింసలకు గురిచేస్తోందని సూర్య విమర్శించారు.

గద్దర్ జీవించి ఉన్నప్పుడు కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని, ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని సూర్య కిరణ్ అన్నారు! ఇదే సమయంలో గద్దర్ మృతి తర్వాత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నిస్తూ ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తూప్రాన్‌ లో తమ భూమిలో సగభాగం ప్రాజెక్టు కారణంగా పోయిందని, మరోచోట తమకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వలేదని సూర్య పేర్కొన్నారు. అయితే ఈ విషయమై స్థానిక ఎమ్మర్వో, ఆర్డీవో, కలెక్టర్‌ ని ఎన్నిసార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాత కేసులతో తన తండ్రిని పోలీసులు వేధించారని ఆయన ఆరోపించారు.

ANN TOP 10