నృత్యం చేస్తూ గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన ఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. గంగాధర ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రదీప్తి ప్రెషర్స్ డే వేడుకల్లో ఏకధాటిగా అరగంట పాటు నృత్యం చేసి కూప్పకూలింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రదీప్తి స్వస్థలం గంగాధర మండలం వెంకటాయపల్లి.
