అదిరిపోయే స్టెప్పులేసిన పాక్ నటి..
టాప్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ వరల్డ్‌వైడ్‌గా సంచలన విజయం సాధించిన తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్‌కు విదేశీయులు కూడా మెస్మరైజ్ అయ్యారు. తాజాగా ఈ ఫీవర్ పాకిస్తాన్‌కు కూడా పాకింది. పాక్ నటి ఒకరు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాకిస్తానీ నటి హనియా ఆమిర్ ఓ పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకలోనే ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ కు స్టెప్పులేశారు. ‘నాటు నాటు’ సాంగ్ హిందీ వెర్షన్ ‘నాచో నాచో’ కు హుక్ డ్యాన్స్ చేసి ఫంక్షన్‌కు వచ్చిన అతిథులను మెస్మరైజ్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులందరు విపరీతంగా షేర్ చేస్తున్నారు. హనియా అద్భుతమైన ఎనర్జీతో డ్యాన్స్ చేసిందని కామెంట్ చేస్తున్నారు.