AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సామాన్యుడికి ఊరట..! దిగొస్తున్న టమాటా ధరలు..

మొన్నమొన్నటి వరకూ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్న టమాట ధరలు తగ్గుతున్నాయి. గడచిన రెండు రెండు రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకూ కిలో టమాట రూ.300 వరకు చేరే అవకాశం ఉందని బెంబేలెత్తిపోతున్న తరుణంలో అనూహ్యంగా ధరలు దిగివచ్చాయి. ప్రస్తుతం రైతుబజారులో కిలో టమాటా రూ.63 వరకు విక్రయిస్తు్న్నారు. ఇక బయట మార్కెట్‌లలో రూ.120 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నారు.

పది రోజుల కిందట హైదరాబాద్‌ నగరానికి కేవలం 850 క్వింటాళ్ల టమాట హోల్‌సేల్‌ మార్కెట్‌కు చేరితే.. సోమవారం 2,450 క్వింటాళ్లు వచ్చింది. ఏపీలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక రాష్ట్రం నుంచి నగరానికి అధిక దిగుబడి వస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని రంగారెడ్డి, వికారాబాద్‌, చేవెళ్ల, నవాబ్‌పేట, మెదక్‌ జిల్లాల నుంచి కూడా పెద్ద మొత్తంలో మార్కెట్‌కు టమాటా రావడంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆగస్టు నెలాఖరుకు కిలో రూ.50లోపు చేరుకునే అవకాశం ఉందని వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

ANN TOP 10