AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొండగట్టు అంజన్న ఆలయ దొంగలు వీళ్లే..!

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు గుర్తించారు. సీసీ పుటేజీల ఆధారంగా ఫొటోలను విడుదల చేశారు. అర్ధరాత్రి అంజన్న ఆలయంలో చోరీ జరిగిన విషయం విదితమే. ఏకంగా 15 కిలోల వెండి నగలతో పాటు అనుబంధ ఆలయంలోని విగ్రహాలను దొంగిలించారు. వీటి విలువ సువ·రు ర·.9 లక్షలు ఉంటుందని తెలుస్తుంది.

ఈ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలయానికి చేరుకొని సీసీ ఫుటేజీని పరిశీలించారు. అలాగే ఆలయాన్ని మూసివేసి భక్తులతో పాటు ఎవరినీ గుడిలోకి అనుమతించలేదు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దొంగలను గుర్తిం  ఫోటోలను పోలీసులు విడుదల చేశారు.
సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. తాజాగా సీసీ ఫుటేజిలోని దొంగల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు.

చోరీకి పాల్పడ్డ నలుగురు నిందితుల చేతిలో కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఎవర· గుర్తుపట్టకుండా మాస్క్‌లులు, కర్చీఫ్‌ వాడారు. ఇక ఆలయ హుండీ, అలాగే కొన్ని నగలు కూడా దొంగలు తీసుకెళ్తున్నట్టు ఈ ఫొటోల్లో కనిపించాయి. పోలీసులు దొంగల కోసం విస్తృతంగా  గాలిస్తున్నారు.

 

ANN TOP 10