AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జగ్గన్నా.. ఇంకా పిల్లవాడిలా తిరిగితే ఎలా?

కేటీఆర్‌, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా గురువారం మంత్రి కేటీఆర్‌ ఛాంబర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెటిఆర్, కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి, మామిళ్ల రాజేందర్ మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. టీ షర్ట్ వేసుకుని శాసనసభకు సంగారెడ్డి ఎంఎల్ఏ జగ్గారెడ్డి వచ్చారు. జగ్గారెడ్డిని చూసి పిల్లవాడిలా తిరిగితే ఎలా అని కెటిఆర్ అడిగారు. టీ షర్ట్ వేసుకుంటే పిల్లవాడిని అవుతానా అని జగ్గారెడ్డి బుదలిచ్చారు.

జగ్గారెడ్డితోపాటే టిఎన్ జీవో రాష్ట్ర అధ్యక్షుడు మావిల్ల రాజేందర్ ఉన్నారు. జగ్గారెడ్డితో స్నేహం ఎక్కడ కుదిరిందని రాజేందర్ ను కేటీఆర్‌ అడిగారు. దీంతో రాజేందర్ మాది ఒకే కంచం, ఒకే మంచం అని చెప్పారు. అలాగైతే జగ్గారెడ్డి గెలిపిస్తారా? అని రాజేందర్ ను కేటీఆర్‌ ప్రశ్నించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని గెలిపించి, మీ దగ్గరకు తీసుకొస్తానని మామిళ్ల రాజేందర్ బదులిచ్చినట్టు తెలుస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10