AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కుందారం కెనాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

లింగాల ఘనపురం మండలం కుందారం కెనాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న వాహనం అతివేగంగా చెట్టును ఢీ కొట్టింది. చెట్టును బలంగా ఢీకొనడంతో వాహనం నుజ్జునుజ్జు అయిపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను108 వాహనంలో చికిత్స నిమిత్తం స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు సింధూజగా గుర్తించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ANN TOP 10