బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఒక లెక్క.. నేడు ఒక లెక్క అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. గడిచిన ఐదు రోజుల నుంచి ప్రతీ రోజూ బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన ఐదు రోజుల నుంచి ప్రతీ రోజూ బులియన్ మార్కెట్లో బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన వారం రోజుల్లో తులం బంగారంపై ఏకంగా రూ. 600 వరకు తగ్గింది. శుక్రవారం కూడా బంగారం ధర తగ్గింది. నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.200 మేర తగ్గి రూ.51,800కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.220 తగ్గి రూ.56,730కి చేరింది. కాగా.. వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. నేడు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.