AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది

కుక్కదాడిలో చనిపోయిన బాలుడి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. సమాజంలో ప్రజలు ఎంత అవసరమో- జంతువులు అంతే అవసరమని…బాలుడి మృతి అనేది చాలా బాధాకరమని తెలిపారు. జనసమూహం, మూసి రివర్ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ ఉంటాయని.. ప్రజలు ఇష్టానుసారం నాన్ వెజిటేరియన్ ను రోడ్ల పై వేయవద్దని తెలిపారు.

ప్రభుత్వానికి అనేక టెక్నీకల్ సమస్యలు ఉంటాయని… మా శాఖ నుంచి స్పెషల్ డ్రైవ్ చేయడానికి 8 మందిని ఇస్తున్నామని తెలిపారు. కోతులు, కుక్కల బెడద లేకుండా చేయడానికి ప్రత్యేక నిపుణులను రప్పిస్తామని.. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. మేయర్ మాట్లాడిన వ్యాఖ్యలను రాజకీయం చేస్తున్నారని..ఎవరో విమర్శ కోసం సలహాలు ఇస్తే మేము తీసుకోమని వివరించారు తలసాని. మాకు తెలుసు ఎలా చర్యలు తీసుకోవాలోనని.. మేము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం..బాబు మృతితోనే మేము అలర్ట్ కాలేదన్నారు తలసాని.

ANN TOP 10