ముంపు ప్రాంతాల్లో కంది శ్రీనన్న పర్యటన
ఆదిలాబాద్: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల ముంపుకు గురయిన ప్రాంతాలలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి పర్యటించారు. జైనథ్ మండల కేంద్రాన్నిసందర్శించి వరదధాటికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. కంది శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇళ్లు , పంటపొలాల్లోకి నీళ్లు చేరి నష్టపోయిన బాధితులను కలిసి పరామర్శించారు.వారికి ధైర్యం చెప్పారు. వర్షాల ధాటికి దెబ్బతిన్న రోడ్లను,తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు. పడిపోయిన విద్యుత్ స్థంభాలను చూసి ఎమ్మెల్యే జోగురామన్న అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. నాసిరకమైన పనులవల్లే మూడునెలలు కూడా కాకుండానే పోల్స్ పడిపోయాయాని ఆరోపించారు.
పనులలో 90 శాతం అవినీతి జరిగిందని ఆరోపించారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఎమ్మెల్యే జోగురామన్న జేబులు నింపుకున్నాడని అన్నారు. వరద బాధితులను కష్టకాలంలో ఆదుకోవడానికి రాని స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న తీరుపై మండిపడ్డారు. తన స్వంత మండలాన్నే పట్టించుకోకపోవడాన్ని నిరసించారు.జోగు రామన్న ప్రజలకు సేవ చేయకుండా నిద్ర పోతున్నడని ఆరోపించారు. నష్టపోయిన 30 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జైనథ్ ఎంపీటీసీ సుదర్శన్,మాజీ ఎంపీటీసీ రాజన్న,లక్ష్మిపూర్ ఎంపీటీసీ మనోజ్, బద్దం సురేష్ రెడ్డి, గిమ్మ సంతోష్, షకీల్, సంతోష్ రెడ్డి, కిష్టా రెడ్డి, పుండ్రు రవి కిరణ్ రెడ్డి, బండి కిష్టాన్న, సంజీవ్, మాజీ కౌన్సిలర్స్ ఓసావార్ సురేష్, గేడం అశోక్, మానే శంకర్, ప్రవీణ్, ఎల్మా రామ్‌రెడ్డి పాల్గొన్నారు.
