AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రంలో మరో మూడు రోజులు వానలే వానలు

దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రా సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలోని చాలాచోట్ల సోమవారం నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించారు. మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

ANN TOP 10