AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు కేటీఆర్ పుట్టినరోజు .. మంత్రి గొప్ప సంకల్పం..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు నేడు. 46 వసంతాలు పూర్తి చేసుకుని 47లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలతో సోషల్ మీడియాలో జాతర మొదలుపెట్టేశారు. అయితే.. తన పుట్టిన రోజుకు బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టి డబ్బులు వృథా చేయకుండా.. వాటిని ఏదైనా సమాజానికి ఉపయోగపడే పనికి వాడాలని కేటీఆర్ చెప్తుంటారు. అంతేకాదు.. గిఫ్ట్ ఏ స్మైల్ సంస్థ పేరుతో.. ఊర్లలో అంబులెన్సులు, దివ్యాంగులకు ట్రై మోటార్ సైకిళ్లు ఇలా మంచి మంచి సేవా కార్యక్రమాలకు తాను శ్రీకారం చుట్టటమే కాకుండా.. తమ ఫాలోవర్స్‌తో కూడా చేయిస్తుంటారు. కాగా.. ఈసారి కూడా కేటీఆర్ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు.. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తాను ఏం చేయనున్నారన్నది ప్రకటించారు.

తన పుట్టిన రోజును పురస్కరించుకొని యూసఫ్ గూడలోని అనాథాశ్రమానికి తన వంతుగా ఏదైనా సాయం చేయాలనుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే.. ఈసారి తాను 47వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఆ అనాథాశ్రమానికి చెందిన ప్రతిభావంతులైన 47 మంది టెన్త్ లేదా ఇంటర్మీడియట్ విద్యార్థులకు, అదేవిధంగా ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న మరో 47 మంది స్టూడెంట్స్‌కు సాయం చేయాలని సంకల్పించినట్టు చెప్పుకొచ్చారు. గిఫ్ట్ ఏ స్మైల్ సంస్థ తరఫున ఆ 47 మంది విద్యార్థులకు తలా ఓ ల్యాప్ టాప్‌ ఇవ్వటమే కాకుండా.. వాళ్లందరికీ రెండేళ్ల పాటు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ANN TOP 10