AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వీఆర్ఏ వ్యవస్థ రద్దు.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

వాళ్లంతా ఇక పర్మినెంట్ ఉద్యోగులే!
వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి, వీఆర్ఏల అర్హతల ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం విడుదల చేయనున్నారు.

ఆదివారం (జులై 23న) సచివాలయంలో వీఆర్ఏ‌లతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన సమావేశం తర్వాత… రాష్ట్రంలో వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్ని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీఆర్ఏల అర్హతలను బట్టి.. మున్సిపాలిటీ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ శాఖల్లో సర్దుబాటు చేయటమే కాకుండా.. వాళ్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే.. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం రోజున విడుదల చేయాలని సీఎం శాంతి కుమారికి ఆదేశాలిచ్చారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో వీఆర్ఏలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10