జలదిగ్బంధంలో ఉన్న కాలనీల్లో పర్యటన
ఆహార పొట్లాలు పంపిణీ చేసిన శ్రీనివాసరెడ్డి
పేదల గోడుపట్టని జోగురామన్నపై మండిపాటు
ఆదిలాబాద్: పట్టణంలోని పలుకాలనీలలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి పర్యటించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు. కోలిపూర ,తాటిగూడ, బంగారి గూడ కాలనీలలో ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్న ప్రజలను కలుసుకున్నారు. వారికి ఆహారాన్ని పంపిణీ చేసారు. ఇదంతా స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ల నిర్లక్ష్యమని పేదల సంక్షేమం పై వారికి చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికైనా నాలుగు మంచి పనులు చేయాలని హితవు పలికారు.
అనంతరం బంగారి గూడలో క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమం లో గిమ్మ సంతోష్, డిస్ట్రిక్ మైనారిటీ సెల్ చైర్మన్ షకీల్, డిస్ట్రిక్ట్ ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కొండూరి రవి, సీనియర్ నాయకులు మన్సూర్, రాజ్ మొహమ్మద్, మాజీ కౌన్సిలర్స్ ఓసావార్ సురేష్, గేడం అశోక్, ప్రభాకర్, నాయకులు మానే శంకర్, ఎల్మా రామ్ రెడ్డి, ముఖీమ్, అస్బాత్ ఖాన్, షేక్ షాహిద్వసీమ్ రంజా, నదీమ్ రంజాని, శ్రీధర్, రషీద్, ముజ్జు, అసిఫ్, అఖిల్, షోహెబ్, సాహిల్, సమీ ఉల్లా ఖాన్ తదితరులు ఆల్గొన్నారు.
